సూర్యాపేట నియోజకవర్గంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఓటర్ల కాళ్లు మొక్కుతూ.. ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను వేడుకున్నారు వట్టే జానయ్య.
విభజన వాదం బీఆర్ఎస్ పార్టీది అయితే.. బహుజనవాదం బీఎస్పీ పార్టీదని హితవు పలికారు. సూర్యాపేటలో గులాబీ జెండను మట్టిలో కలిపి.. బహుజన జెండను ఎగురవేసే రోజులు దగ్గరపడ్డాయన్నారు. సూర్యాపేటలో తనను అత్యధిక మోజారిటీతో గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు వట్టే జానయ్య.