తెలంగాణలో పార్టీల తీరు విడ్డూరం!

తెలంగాణలో పార్టీల తీరు విడ్డూరం!

రాష్ట్రంలో ఎన్నికల ప్రచార హడావుడి కొనసాగుతోంది. ఆయా రాజకీయ పార్టీలు మేనిఫెస్టో(హామీలు)ను వివరిస్తూ ప్రజల నుంచి ఓట్లు రాబట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో అధికార పార్టీ నాయకులు.. పెన్షన్ వస్తుందా?, రైతు బంధు, రైతు బీమా అందుతుందా అని అడుగుతున్నారు. గ్యాస్ రూ.500కే ఇస్తామని ఓ పార్టీ, రూ.400కే అందిస్తామని కొన్ని పార్టీలు ప్రగల్భాలు పలుకుతున్నాయి.  కానీ,  ఇవి ప్రస్తుత పాలనలో ఎందుకు చేయట్లేదు?. 

ఎందరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది?. రైతులు, చేనేతలు ఉన్నారా?.. వాళ్లు ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా? అని ఎందుకు అడగడం లేదు? అసలు ఇలాంటివి ఏవైనా ఆరా తీస్తున్నారా?. ప్రస్తుత ప్రభుత్వంలో చేయలేనివి.. మళ్లీ అధికారంలోకి వచ్చాక చేస్తామని చెప్పడం విడ్డూరం!. అంతేగాక గతంలో పాలించిన పార్టీలు అప్పుడు చేయలేనివి.. ఒక్క అవకాశం ఇస్తే అన్నీ చేసేస్తామని మాట్లాడడం హాస్యాస్పదం.

-  తలారి గణేష్, సామాజిక కార్యకర్త