
కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభధ్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఎల్లుండి 22న జరగనుంది. దీనికి సంబంధించిన ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం నాలుగింటితో ముగిసింది. ఇవాళ్టి నుంచి ఎన్నికలు ముగిసేవరకు .. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల వరకు ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో మద్యం షాపులు మూతపడనున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా… రేపు, ఎల్లుండి రెండురోజుల పాటు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలో పార్లమెంట్ అభ్యర్థుల ప్రచారానికి బ్రేక్ పడింది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఇక్కడ ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చని ఈసీ అధికారులు చెప్పారు.