జీవన్ రెడ్డిని తరిమికొడితేనే ఆర్మూర్ అభివృద్ధి సాధ్యం : వినయ్ రెడ్డి

ఆర్మూర్, వెలుగు: పదేండ్లలో ఆర్మూర్​లో ప్రజలు ఆశించిన అభివృద్ధి జరగలేదని, జీవన్ రెడ్డిని ఓడించి ఆర్మూర్ నుంచి తరిమికొడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి, రాంపూర్, ఆలూర్ మండలం మిర్ధాపల్లి, దేగాం, గుత్ప గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

వినయ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఒక్క ఇల్లు కట్టివ్వలేని జీవన్ రెడ్డి రూ.వందల కోట్లతో షాపింగ్ మాల్, ఆర్మూర్, హైదరాబాద్ లో హైటెక్ బంగ్లాలు కట్టుకున్నారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పిన కేసీఆర్, తన ఇంట్లోని వారికే ఉద్యోగాలు ఇచ్చుకున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, చెప్పిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. సీనియర్ నాయకులు మార చంద్రమోహన్, యాల్ల సాయరెడ్డి,  విట్టం జీవన్, సాయిబాబా గౌడ్, కోలా వెంకటేశ్, పుట్టింటి శ్రీనివాస్ రెడ్డి, దూదిగాం ప్రమోద్, చిన్నారెడ్డి, ముక్కెర విజయ్, మధు, శంకర్, శ్రీనివాస్, మల్లారెడ్డి పాల్గొన్నారు.

ALSO READ : అభ్యర్థులు కేసుల వివరాలు ఇవ్వాలి : కలెక్టర్​ రాజర్షి షా