అశ్వారావుపేట, వెలుగు: మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బుధవారం అశ్వారావుపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టౌన్‌లోని ప్రతి షాపుకు తిరుగుతూ ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి బట్టల షోరూమ్‌కు వెళ్లారు.
ఎంపీపీ అయి ఉండి ఇంత చిన్న షాపు నడపడం ఏమిటని వెంకటేశ్వర్లు ప్రశ్నించగా, ‘పదవిలోకి వచ్చిన తర్వాత రూ.2కోట్లు నష్టపోయాను. రూ.కోటి పెట్టి ఎంపీపీ పదవిని కొనుక్కున్నాను’ అని మీడియా ముందే శ్రీరామ్మూర్తి చెప్పారు.