గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా: పద్మా దేవేందర్ రెడ్డి

గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా: పద్మా దేవేందర్ రెడ్డి

చిన్నశంకరంపేట, వెలుగు: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తిరిగి ఢిల్లీ పెద్దల చేతిలో పెడదామా అని బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం మండలంలోని మిర్జాపల్లి, మీర్జాపల్లి తండా, కామారం తండా, కామారం, అంబాజీపేట, సంగాయపల్లి, మాందాపూర్, మాందాపూర్ తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల కష్టాలు ఎరుగని రేవంత్ రెడ్డి 24 గంటలు కాకుండా కేవలం 3 గంటలే కరెంట్​ చాలానడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలుచేయడం లేదో ప్రజలు గ్రహించాలన్నారు.

నిరంతరం నియోజకవర్గ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ అందుబాటులో ఉండే తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. హ్యాట్రిక్ విజయంతో మంత్రి పదవి పొంది నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో  జడ్పీటీసీ పట్లోరి మాధవి, మండల పార్టీ అధ్యక్షుడు పట్లోరి రాజు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి,  జంకు బాయ్, రాములు నాయక్, మీనా రవీందర్, పూలపల్లి యాదగిరి యాదవ్, నాయకులు ఏకే గంగాధర్ రావు, బాలకృష్ణ, పోతరాజు రమణ,  వైస్ ఎంపీపీ సత్యనారాయణగౌడ్, ఎంపీటీసీలు శివకుమార్, ప్రసాద్ గౌడ్, గొండస్వామి, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, చంద్రం, సుధాకర్, బాగారెడ్డి, పోతురాజు, నరేశ్, మహేశ్ పాల్గొన్నారు.