మొగుళ్లపల్లి, వెలుగు : గ్రామాల్లో అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్‌ఎస్సే అధికారంలోకి రావాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య చెప్పారు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాయమాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ లీడర్ల మాటలు నమ్మొద్దని చెప్పారు.
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో అధికారం బీఆర్‌ఎస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గెలిస్తే కరెంట్ కష్టాలు తప్పవని, బీజేపీకి ఓటు వేస్తే మోటార్లకు మీటర్లు ఖాయమన్నారు. కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ చైర్మన్ కొడారి రమేశ్, జడ్పీటీసీ సదయ్య, ఎంపీపీ సుజాత సంజీవరెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతిరావు, సొసైటీ చైర్మన్ నర్సింగరావు పాల్గొన్నారు.