
రాష్ట్రంలో రేపు లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నిక ప్రచారం కూడా నిన్నటితో ముగిసింది. అయితే ఉపాధ్యాయురాలు మాత్రం వాట్సాప్ ద్వారా TRS అభ్యర్ధి తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న ఆ ఉపాధ్యాయురాలిని సస్సెండ్ చేశారు జిల్లా కలెక్టర్. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.
నిజామాబాద్ TRS పార్లమెంటు అభ్యర్థి గెలుపు కొరకు జగిత్యాల పురాణి పేట్ బాళికల స్కూల్లో PET టీచర్ గా పనిచేస్తున్న జమునారాణి వాట్సాప్ ద్వారా ఎన్నికల ప్రచారం చేస్తోంది. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖాధికారి.. కలెక్టర్ శరత్ కు ప్రాథమిక నివేదిక సమర్పించారు. నివేదిక ఆధారంగా టీచర్ జమునా రాణిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు జిల్లా కలెక్టర్.