నిజామాబాద్, వెలుగు: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నందున ఓటర్‌లిస్టును మరోసారి చెక్‌చేయాలని రాష్ట్ర ఎన్నికల చీఫ్ వికాస్రాజ్సూచించారు. అర్హులెవరూ నష్టపోకుండా జాబితా సిద్ధం చేయాలన్నారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీసీలో మాట్లాడారు. ఎక్కువ సంఖ్యలో ఓట్లు తగ్గిన బూత్‌లను విజిట్‌చేసి కారణాలు తెలుసుకోవాలని సూచించారు. ఈ నెల 23 నాటికి ఓటరు మార్పు, చేర్పుల సర్వే పూర్తిచేయాలన్నారు. గతంలో తక్కువ పోలింగ్‌శాతం నమోదైన ప్రాంతాలను గుర్తించి, ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు.
పోలీస్ స్టేషన్ప్రతీ చోటా గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే ఉండాలని వికాస్‌రాజ్ సూచించారు. ర్యాంప్‌లు ఏర్పాటు చేయాలన్నారు. సోషల్‌మీడియా పోస్టులను గమనించాలని, వదంతులు వ్యాప్తి చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇన్చార్జి కమిషనర్ ప్రవీణ్‌కుమార్, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ట్రైనీ కలెక్టర్ కిరణ్మయి, సీఈవో గోవింద్, డీఆర్డీవో చందర్, ఆర్డీవోలు రాజేశ్వర్, రవి పాల్గొన్నారు.