
కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని సీపీ అభిషేక్ మహంతి ఆదేశించారు. శుక్రవారం కమిషనరేట్‌లో అన్ని విభాగాల అధికారులు, ఎస్‌హెచ్‌వోలతో నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు. చెక్ పోస్టులు పనితీరుపై ,వాహన తనిఖీలు క్షుణ్ణంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ సెంటర్లను స్టేషన్ ఆఫీసర్లు స్వయంగా పరిశీలించనున్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ(లా అండ్ ఆర్డర్) ఎ.లక్ష్మీనారాయణ, ఏసీపీలు శ్రీనివాస్ , నరేందర్, వెంకటరమణ, శ్రీనివాస్ జీ, మాధవి, విజయ్ కుమార్, వేణుగోపాల్, కాశయ్య తదితరులు పాల్గొన్నారు.