తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పలుచోట్ల అయాపార్టీల నాయకుల ఫ్లెక్సీలు, హోర్డింగులను తొలగించడంలో నిర్లక్ష్యం బయటపడుతోంది. శంషాబాదద్ హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై ఎటు చూసినా అధికార పార్టీ సంక్షేమ పథకాల హోల్డింగ్ లతో పాటు కాంగ్రెస్, బీజేపీల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.
Also Read :- లవర్ తో బైక్ స్టంట్స్
నిత్యం మంత్రులు, అధికారులు, వేలాదిమంది తిరిగే రోడ్డుకు ఇరువైపుల పెద్దఎత్తున ఫ్లెక్సీలు దర్శనమిస్తున్న మున్సిపల్ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడంలో అంతర్యమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఫ్లెక్సీలను తొలగించకపోవడంపై ప్రజలు స్థానికంగా చర్చించుకుంటున్నారు. అందరికి ఎన్నికల కోడ్ నిబంధనలు గురించి చెప్పే అధికారులే కోడ్‌ను పాటించకపోవడంతో విమర్శలకు దారితీస్తోంది.