తుది ఫలితాలు వెల్లడించిన ఈసీ

తుది ఫలితాలు వెల్లడించిన ఈసీ
  •  బీజేపీకి 240, కాంగ్రెస్ కు 99
  •  చివరన వెలువడ్డ ‘బీడ్’ రిజల్ట్

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలను ప్రకటించింది.  దేశంలోని 543 స్థానాలకు  నోటిఫికేషన్ ఇవ్వగా సూరత్ నుంచి బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. 542 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 240 స్థానాలు గెలుపొంది బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 99 సీట్లతో రెండో  పెద్ద పార్టీగా  నిలిచింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ 294 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి 231 సీట్లు వచ్చాయి. 

ఎన్నికల సంఘం తన చివరి ఫలితాన్ని మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గానిది వెల్లడించింది. ఇక్కడ ఎన్సీపీ(శరద్ పవార్ వర్గం) అభ్యర్థి బజరంగ్ మోహార్ సోన్వానే, బీజేపీకి చెందిన పంకజా ముండేపై 6, 553 ఓట్ల తేడాతో విజయం సాధించారు.