ఏపీలో ఐపీఎస్ లకు ఈసీ షాక్: ఇద్దరు సీనియర్లపై బదిలీ వేటు..

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికలను ఈసీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల కోడ్ ను పకడ్బందీగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ లను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఈసీ. విజయవాడ నగర కమిషనర్ కాంతి రానా, ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులపై ఈసీ బదిలీ వేటు వేసింది.

ఈ ఇద్దరు సీనియర్ అధికారులు తక్షణమే విధుల నుంచి తప్పుకోవాలని, ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని ఆదేశించింది ఎన్నికల సంఘం. ఇటీవల విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసును సీరియస్ గా తీసుకున్న ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.