ఏపీలో ఎన్నికల నేపథ్యంలో జరిగిన అల్లర్లు తీవ్ర కలకలం రేపాయి. పోలింగ్ జరిగిన మరుసటి రోజు కూడా చాలా చోట్ల టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకుంది. ఈ అల్లర్లను సీరియస్ గా తీసుకున్న ఈసీ ఆయా జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెండ్ చేసిన ఎస్పీల స్థానంలో కొత్త ఎస్పీలను నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల సంఘం.
తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్, పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికాగార్గ్, అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమిశాలిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల సంఘం. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్ గా లట్కర్ శ్రీకేష్ బాలాజీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈసీ.