ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం.. 

ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్ల కారణంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అల్లర్లను సీరియస్ గా తీసుకున్న ఈసీ ఇప్పటికే ఆయా జిల్లాల ఎస్పీల స్థానంలో కొత్త ఎస్పీలను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కంటైనర్లు, బాటిళ్లలో పెట్రోల్ అమ్మకంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం. ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4వ తేదీ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది ఈసీ.

జూన్ 4వ తేదీ వరకు వాహనాల్లో మాత్రమే పెట్రోల్, డీజిల్ నింపాలని, ఎట్టి పరిస్థితిలోను బాటిళ్లు, కంటైనర్లలో నింపకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన పెట్రోల్ బ్యాంకులపై కఠిన చర్యలు తప్పవని, లైసెన్సులు రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది ఈసీ.ఈ మేరకు అన్ని బంకుల యజమానులకు నోటీసులు పంపింది ఎన్నికల సంఘం.