ఎలక్షన్ చెకింగ్స్ : CMల హెలికాప్టర్లను కూడా వదల్లేదు

ఎలక్షన్ చెకింగ్స్ : CMల హెలికాప్టర్లను కూడా వదల్లేదు

ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఎక్కువగా కనిపించడంతో ఎలక్షన్ స్క్వాడ్ ఎవరినీ వదలడంలేదు. ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులను కూడా తనిఖీ చేస్తున్నారు సిబ్బంది. మంగళవారం షిమోగాలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప హెలికాప్టర్ ను, బ్యాగులను తనిఖీ చేశారు. అలాగే రూర్కెలాలలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హెలికాప్టర్లను తనిఖీ చేశారు. బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి హెలికాప్టర్ ను చెక్ చేశారు. చాపర్ లోని ప్రతీ బ్యాగ్ ను పరిశీలించారు. వారంతా ప్రచారానికి వెళ్లే ముందు తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎలక్షన్ స్క్వాడ్.