పంటనష్ట పరిహారానికి .. ఈసీ గ్రీన్ సిగ్నల్

పంటనష్ట పరిహారానికి .. ఈసీ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు మొదటి విడత నష్టపరిహారం ఇచ్చేందుకు ఎలక్షన్​కమిషన్ (ఈసీ) గ్రీన్​సిగ్నల్​ఇచ్చింది.  ఈ ఏడాది మార్చిలో అకాల వర్షాలు కురియడంతో  రాష్ట్రవ్యాప్తంగా15,814.03 ఎకరాల్లో పంటనష్టం జరిగింది. పంట నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. కానీ మార్చి17న ఎలక్షన్​కోడ్​అమల్లోకి రావడంతో పరిహారం చెల్లింపునకు బ్రేక్​ పడింది. తాజాగా ఈసీ అనుమతి ఇవ్వడంతో రైతుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం పైసలు జమ కానున్నాయి. దీనిపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

మార్చిలో పంట నష్టం 

 మార్చి నెలలో నాలుగైదు రోజుల పాటు కురిసిన వడగండ్ల వానలు, అకాల వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పంట నష్టం జరిగింది.  సర్కారు ఆదేశాలతో అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  క్షేత్రస్థాయి అధికారులతో పంట నష్టంపై ఎన్యూమరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేపట్టింది. ఏఈవో, ఏవో స్థాయి అధికారులు గ్రామాల్లోకి వెళ్లి నేరుగా పొలాల వద్ద పంట నష్టంపై సర్వే చేశారు.  అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని గుర్తించడంతో పాటు రైతుల వివరాలను సేకరించారు.15,814.03 ఎకరాల్లో పంట నష్టం  జరిగినట్టు తేల్చారు. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 10,328.04 ఎకరాల్లో  నష్టం జరిగినట్టు గుర్తించారు. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 1,652 .25 ఎకరాలు, సిరిసిల్లలో 1,014 .06 ఎకరాలు, మిగతా సిద్దిపేట, మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లో వెయ్యి ఎకరాల లోపు నష్టం జరిగింది. నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మంచిర్యాల, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఐదు వందల ఎకరాల లోపు నష్టం జరుగగా, సంగారెడ్డి జిల్లాలో 76.04 ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం15,246 మంది రైతులకు చెందిన 15,814.03 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు తేల్చిన వ్యవసాయశాఖ అధికారులు  సర్కారుకు నివేదించారు.

ఎన్నికల కోడ్​తో ఆగింది 

పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున  పరిహారం ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. వ్యవసాయశాఖ దీనికి సంబంధించిన బిల్లులను ఆర్థికశాఖకు పంపించింది. పార్లమెంట్​ఎన్నికల నేపథ్యంలో మార్చి 17 నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్​ అమల్లోకి రావడంతో పరిహారం చెల్లింపునకు తాత్కాలికంగా బ్రేక్​ పడింది. దీనిపై వ్యవసాయశాఖ  ఎలక్షన్​కమిషన్​ను క్లారిటీ కోరింది. తాజాగా, పంట నష్టపరిహారం అందించేందుకు ఈసీ అనుమతించడంతో రైతుల ఖాతాల్లో రూ.15.81కోట్ల పరిహారం జమకానున్నది.  కాగా, రెండో విడత 3,121 ఎకరాల్లో జరిగిన నష్టంపై ఈసీ​అనుమతి రావాల్సి ఉంది.