ఎలక్షన్ కమిషన్ రాజీపడింది.. చాలా లోపాలున్నాయి: రాహుల్ గాంధీ

ఎలక్షన్ కమిషన్ రాజీపడింది.. చాలా లోపాలున్నాయి: రాహుల్ గాంధీ

ఎన్నికలను సక్రమంగా జరిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎలక్షన్ కమిషన్ రాజీపడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఆదివారం (ఏప్రిల్ 20) అమెరికా పర్యటనకు వెళ్లిన రాహుల్.. మహారాష్ట్ర ఎన్నికల సమయంలో ఈసీ రాజీపడిందని, సిస్టమ్ లో చాలా లోపాలున్నాయని విమర్శించారు. కేవలం రెండు గంటలలో 65 లక్షల ఓట్లను చేర్చడంతోనే ఈ విషయం అర్థం అవుతుందని అన్నారు. బోస్టన్ లో జరిగిన ఓ మీటింగ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్ర ఎన్నికల సరళి సక్రమంగా లేదని, కొందరికి మేలు కలిగించేలా ఎన్నికల సంఘం వ్యవహరించిందని విమర్శించారు. ‘‘మహారాష్ట్రలో ఉన్న జనాభా కంటే ఎక్కువ మంది ఓటేశారు. ఎన్నికల సంఘం 5.30 గంటలకు ఓటింగ్ ఫిగర్ ఇచ్చింది. కానీ 7.30 గంటల లోపు మరో 65 లక్షల మంది ఓటేశారు. ఇది ఎలా సాధ్యమవుతుంది..?’’ అని ప్రశ్నించారు.  ఎన్నికల సంఘం కాంప్రమైజ్ అయ్యిందని, సిస్టమ్ లో చాలా లోపాలు ఉన్నాయని భారతీయ అమెరికన్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు. 

Also Read : ట్రంప్ విధానాలపై భగ్గుమంటున్న అమెరికన్లు

ఇండియా, యూఎస్ సంబంధాలపై కూడా రాహుల్ మాట్లాడారు. ఇండియా, యూఎస్ ఎన్నాళ్లుగానో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయని, ఇవి మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని, జెండాను అమెరికా వరకు క్యారీ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

రాహుల్ భారత్ బద్నాం యాత్ర చేస్తున్నారు: బీజేపీ

రాహుల్ విదేశాల్లో భారత్ గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ విమర్శించింది. భారత్ బద్నాం యాత్ర చేస్తున్నారని మండిపడింది. రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని బేజీపీ స్పోక్ పర్సన్ సెహజాద్ పూనావాలా అన్నారు. యాంటీ నరేంద్ర మోదీగా ఉన్న కొందరు చివరికి యాంటీ ఇండియా గా మారుతున్నారని విమర్శించారు.