MLC Election: హైదరాబాద్లో మోగిన ఎన్నికల నగారా

MLC Election: హైదరాబాద్లో మోగిన ఎన్నికల నగారా

 హైదరాబాద్ లో ఎన్నికల నగారా మోగింది.  హైదరాబాద్ స్థానిక  సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ రిలీజ్  చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.  ఎమ్మెల్సీగా ఉన్న ఎంఎస్  ప్రభాకర్ రావు ఎన్నిక గడువు మే1తో ముగియనుంది. దీంతో ఈ స్థానానికి షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. 

 ఎన్నికలషెడ్యూల్

 ఏప్రిల్ 23న  ఎన్నిక జరగనుండగా..25న కౌంటింగ్ జరగనుంది. మార్చి 28న ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్ 4 వరకు నామినేషన్ల గడువు ఉండగా నామినేషన్ల విత్ డ్రాకు ఏప్రిల్ 7 వరకు అవకాశం ఉంది.  ఇవ్వనున్నారు.

ఈ ఎన్నికపై ఇప్పటికే కాంగ్రెస్,బీఆర్ఎస్, బీజేపీ,ఎంఐఎం ఫోకస్ పెట్టాయి. ఎలాగైనా  ఈ స్థానాన్ని కైవసం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల వేటలో పడ్డాయి. అయితే ఈ ఎన్నికలో కాంగ్రెస్ ఎంఐఎంకు మద్దతిచ్చే అవకాశం ఉంది.