జమ్మూకశ్మీర్ లో ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈసీ

జమ్మూకశ్మీర్ లో ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈసీ

లోక్ సభ ఎన్నికల తర్వాత జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు  ఎన్నికల కమిషన్ సిద్దమవుతోంది. ఈ క్రమంలో రిజిస్టర్ లేని పార్టీలు  గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది . త్వరలోనే ఎన్నికల ప్రక్రియను ఈసీ ప్రారంభిస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్  ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే..

జమ్మూ కాశ్మీర్‌లోని కేంద్ర పాలిత ప్రాంత శాసనసభకు అసెంబ్లీ ఎన్నికలు, 1968 ఎన్నికల చిహ్నాలు (రిజర్వేషన్ & కేటాయింపు)  ఆర్డర్ ప్రకారం గుర్తింపు లేని పార్టీ సభ గడువు ముగిసే ఆరు నెలల ముందు గుర్తు కోసం అప్లై చేసుకోవచ్చని  అధికారి తెలిపారు. 

చివరి సారిగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు 2014లో జరిగాయి. 2018 జూన్ 19న BJP  మద్దతు ఉపసంహరించుకోవడంతో  మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో  రాష్ట్రపతి పాలన విధించారు.  2019 ఆగష్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35Aని రద్దు చేసిన సంగతి తెలిసిందే..

ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని గత ఏడాది సుప్రీంకోర్టు సమర్థించింది, ఈ నిబంధన తాత్కాలికమేనని, రద్దు రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. 30 సెప్టెంబర్ 2024 నాటికి పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం ఏర్పాటైన జమ్మూ , కాశ్మీర్ శాసనసభకు ఎన్నికలను నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.

 ఇటీవల జరిగిన  లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్‌లో 58.58 శాతం ఓటింగ్ నమోదైంది, కశ్మీర్ లోయలోని లోక్‌సభ స్థానాల్లో 51.05 శాతం ఓటర్లు నమోదయ్యారు, ఇది దాదాపు నాలుగు దశాబ్దాలలో అత్యధికం.