
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు దేశవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశామని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఏడు విడతలుగా పోలింగ్ విజయవంతంగా జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా 64 కోట్ల మందికి పైగా ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఓటేసిన వారిలో 31 కోట్లమందికి పైగా మహిళలే ఉన్నారని తెలిపారు. ఇది ప్రపంచ రికార్డు అని వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల తరువాత ఆయన తొలిసారి ప్రెస్ మీట్ నిర్వహించారు.
రాజీవ్ కుమార్ పాయింట్స్
- ఓటర్లకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చిన ఈసీ బృందం
- ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
- అన్ని ప్రశ్నలకు మేం సమాధానం చెబుతాం
- ఓటింగ్ లో భారత్ రికార్డు సృష్టించింది.
- మనదేశంలో ఓటేసిన వారి సంఖ్య.. జీ7 దేశాల జనాభాకు ఒకటిన్నర రేట్లు
- ఈ ఎన్నికల్లో కోటి 50 లక్షల మంది పోలింగ్, సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహించారు
- 7 దశల్లో పోలింగ్ కోసం 135 ప్రత్యేక రైళ్లు నడిచాయి
- పోలింగ్ సామాగ్రి కోసం 4 లక్షల వాహనాలు వినియోగించాం
- 68 వేల 763 టీమ్స్.. పోలింగ్ తీరును సమీక్షించాయి
- వెయ్యి 692 పోలింగ్ స్టేషన్లకు హెలికాఫ్టర్ల ద్వారా సామాగ్రి తరలించటం జరిగింది.
- ఈసీపై తప్పుడు ప్రచారం సరికాదు
- తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం