జనసేనకు ఈసీ గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తు రిజర్వ్..

జనసేనకు ఈసీ గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తు రిజర్వ్..

జనసేనకు గుడ్ న్యూస్ చెప్పింది ఎన్నికల సంఘం.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,ఆ పార్టీ కార్యకర్తలు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న గుర్తింపు రానే వచ్చేసింది. దీంతో పాటు జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది ఈసీ. జనసేన పార్టీని ఏపీలో గుర్తింపు పొందిన పార్టీల లిస్ట్ లో చేర్చింది ఈసీ... జనసేనను గుర్తింపు పొందిన పార్టీగా ప్రకటిస్తూ.. గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేస్తూ పవన్ కళ్యాణ్ కు అధికారిక లేఖ పంపింది ఈసీ. 

2014లో ఆవిర్భవించిన జనసేన 2019 ఎన్నికల్లో పోటీ చేసి కేవలం ఒక ఎమ్మెల్యే స్థానానికే పరిమితమై ఘోర పరాభవం చవి చూసింది..  ఆ తర్వాత  2024  ఎన్నికల్లో 100 శాతం విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు క్రియేట్ చేసింది జనసేన. 100 శాతం స్ట్రైక్ రేట్ తో ఊపు మీదున్న జనసేనకు గుర్తింపు పొందిన పార్టీగా నిలివటం, గాజు గ్లాసు గుర్తు సైతం రిజర్వ్ అవ్వటం మరింత జోష్ ఇచ్చే అంశమని చెప్పాలి.

ALSO READ | 2028 నాటికి ఏఐ రంగంలో 28 లక్షల ఉద్యోగాలు: దావోస్ లో మంత్రి నారా లోకేష్