ఏపీలో మరోసారి ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..

ఏపీలో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరోసారి ఎన్నికలు జరగనున్నాయి. శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న సి. రామచంద్రయ్య, మహమ్మద్ ఇక్బల్ లు పార్టీ మారటంతో వారిపై అనర్హత వేటు పడింది. దీంతో మండలిలో రెండు స్థానాలు కాళీ అయ్యాయి.

ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. జులై 12న మండలి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ రిలీజ్ చేసింది ఈసీ. ఎన్నికలు జరిగిన రోజే ఫలితాలు వెలువడుతాయని తెలిపింది ఈసీ. అసెంబ్లీ కూటమికే బలం ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు నామమాత్రం అనే చెప్పచ్చు.