రూ. 1500 ఎక్కువ ఉన్నాయని సీజ్ చేసిన్రు

యాదాద్రి, హాలియా, డిండి, మఠంపల్లి, వెలుగు: రూల్స్​కు మించి రూ. 1500 ఎక్కువ ఉన్నాయని జనగామకు చెందిన వ్యాపారీ లగిశెట్టి విజయ్​కుమార్ వద్ద ఉన్న నగదును ఆలేరు పోలీసులు సీజ్​ చేశారు. ఎన్నికల కమిషన్​ రూల్స్​ ప్రకారం రూ. 50 వేలకు మించి ఏ వ్యక్తి వద్ద నగదు ఉండకూడదు. హైదరాబాద్​కు కారులో వెళ్తున్న విజయ్​కుమార్‌‌‌‌ను చెక్‌‌ చేసిన పోలీసులు రూ. 51500  ఉండడంతో సీజ్​చేసి..  ఫ్రూప్స్​ తెస్తే తిరిగి ఇస్తామని చెప్పి పంపించేశారు.

యాదాద్రి జిల్లాలోని చెక్​ పోస్టుల వద్ద నిర్వహించిన తనిఖీల్లో  రూ. 6,68,810 పోలీసులు స్వాధీన చేసుకున్నారు. ఆలేరు చెక్​పోస్ట్​ వద్ద రూ.  3,48,350, సీఎం కేసీఆర్​ దత్తత గ్రామమైన వాసాలమర్రి చెక్​ పోస్ట్​ వద్ద రూ. 1.50 లక్షలు సీజ్​ చేశారు. నల్గొండ జిల్లా పెద్దవూర పోలీసులు వాహన తనిఖీల్లో  ధనావత్​ కోటి, ఎరుకల సూరజ్​ వ్యక్తులతో పాటు మరో ఇద్దరి నుంచి రూ 2,84,000 స్వాధీనం చేసుకున్నారు.

కొండమల్లేపల్లిలో దేవరకొండ నుంచి హైదరాబాద్‌‌కు కారులో వెళ్తున్న సముద్రాల వేంకటేశ్వర్లు వద్ద రూ. 60 వేలు,  చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురు వ్యక్తుల నుంచి రూ. 1.80 లక్షలు పట్టుకున్నారు.  డిండి మండల కేంద్రానికి చెందిన సింకారి మల్లాజి నుంచి రూ. 1,00,500, మఠంపల్లిలో పలువురి నుంచి రూ. 3 లక్షలు నుంచి స్వాధీనం చేసుకున్నారు.