లోక్​సభ ఎన్నికల  స్ట్రాంగ్​ రూమ్​ కోసం కలెక్టర్ పరిశీలన

నిజామాబాద్, వెలుగు: ఎన్నికల కమిషన్​ఆదేశాల మేరకు లోక్​సభ ఎలక్షన్​లో స్ట్రాంగ్​రూమ్ కోసం కలెక్టర్ ​రాజీవ్​ గాంధీ వెతుకులాట షురూ చేశారు. శుక్రవారం డిచ్​పల్లిలోని సీఎంసీ కాలేజీ బిల్డింగ్ ని ఆయన పరిశీలించారు. వినియోగంలో లేని ఈ బిల్డింగ్​ను కొద్ది మేర బాగు చేసి నివేదిక ఇవ్వాలని కోరారు.

2014, 2019 లోక్​సభ ఎన్నికల కోసం ఈ బిల్డింగ్​నే వాడిన విషయాన్ని స్థానిక ఆఫీసర్లు కలెక్టర్​కు వివరించారు.  ఆర్డీవో రాజేంద్రకుమార్, జిల్లా లేబర్​ ఆఫీసర్​ యోహాన్, బోధన్​తహసీల్దార్ గంగాధర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్​ తదితరులు పాల్గొన్నారు