2024 ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కోడ్ ను పకడ్బందీగా అమలు చేస్తోంది. కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డ నేతలకు ఎప్పటికప్పుడు నోటీసులు పంపుతున్న ఈసీ, ప్రభుత్వ ఉద్యోగులపై కూడా గట్టి నిఘా పెట్టింది. ఈ క్రమంలో కడప జిల్లాకు చెందిన పంచాయితీరాజ్ శాఖ అసిస్టెంట్ సెక్రటరీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల సంఘం.
కడప జిల్లా బద్వేలులో పంచాయితీ రాజ్ శాఖ అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్న వెంకట్ రెడ్డి వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్నాడన్న టీడీపీ ఫిర్యాదు మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న వెంకట్ రెడ్డి ఆర్టీసీ ఉద్యోగులతో భేటీ నిర్వహించినందుకు టీడీపీ చేసిన ఫిర్యాదు మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది ఈసీ. దీంతో హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్ళద్దని వెంకట్ రెడ్డిని ఆదేశించింది ఈసీ.