చంద్రబాబుకు షాక్: చర్యల దిశగా ఈసీ అడుగులు.. 

2024 ఎన్నికలు సమయం ముంచుకొస్తున్న తరుణంలో ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకీ రెట్టింపవుతోంది. ఈ ఎన్నికలను నాయకులే కాకుండా ఈసీ కేసుల ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల కోడ్ ను పకడ్బందీగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది ఈసీ. ప్రజాగళం బహిరంగ సభల్లో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ వైసీపీ చేసిన ఫిర్యాదుపై చంద్రబాబుకు ఈసీ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.

ఈసీ పంపిన నోటీసులకు చంద్రబాబు ఇచ్చిన వివరణతో ఈసీ సంతృప్తి చెందలేదని, చంద్రబాబుకు జారీ చేసిన పలు నోటీసుల్లో కొన్ని నోటిసులకు చంద్రబాబు వివరణ ఇవ్వలేదని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసారు సీఈవో ముఖేష్ కుమార్ మీనా. చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ కు లేఖ రాసారు సీఈవో మీనా. ఈ లేఖకు వైసీపీ ఇచ్చిన వీడియో క్లిప్స్ ను కేసుల జత చేశారు ముఖేష్ కుమార్ మీనా.