ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దర్శకు చేరుకున్న సమయంలో ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేసింది ఈసీ. రేపు ఉదయం 11గంటల లోగా కొత్త డీజీపీ నియామక ప్రతిపాదనలు పంపాలని, ముగ్గరు డీజీ ర్యాంక్ అధికారుల పేర్లను పంపాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం.
ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో డీజీపీపై బదిలీ వేటు వేసి అందరికీ షాక్ ఇచ్చింది ఈసీ. డీజీపీని బదిలీ చేయాలంటూ కూటమి నేతలు గత కొద్దిరోజులుగా చేస్తున్న ఫిర్యాదుల మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.