ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో రాజకీయ వేడి రెట్టింపవుతుంది. పోలింగ్ తేదికి మరో 6రోజులు మాత్రమే సమయం ఉండటంతో నేతల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. ఇదిలా ఉండగా ఎన్నికల సంఘం తరచూ అధికారులపై కొరడా ఝుళిపిస్తూనే ఉంది. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసిన ఈసీ తాజాగా ఇద్దరు పొలిసు అధికారులపై బదిలీ వెతుక్ వేసింది.
పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సదుం ఎస్ఐ మారుతిలను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం. వీరిద్దరూ తక్షణమే విధుల నుండి వైదొలగాలని, వీరికి ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది ఈసీ. ఎన్నికలు దగ్గరపడింది సమయంలో ఈసీ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.