న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ముందు బిగ్ షాక్..కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. అరుణ్ గోయల్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. వాస్తవానికి 2027 వరకు అరుణ్ గోయల్ పదవీ కాలం ముగియనుంది.లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో అరుణ్ గోయల్ రాజీనామా చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు వారంరోజుల్లో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే ప్రకటిస్తారని ప్రచారం ఉన్న సమయంలో అరుణ్ గోయల్ రాజీనామా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఒక ఈసీ పోస్ట్ ఖాళీగా ఉంది. ఇప్పుడు అరుణ్ గోయల్ రాజీనామాతో రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. లోక్ సభ ఎన్నికల ముందుకు అరుణ్ గోయల్ తప్పుకోవడానికి గల కారణాలు తెలిసి రాలేదు.