కొండగట్టు, వెలుగు: స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి సోమవారం కొండగట్టు అంజన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో వారికి స్వాగతం పలికి, దర్శనానంతరం స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆలయ ఆవరణలో ఎలక్షన్కమిషనర్పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో కలెక్టర్ యాస్మిన్ భాష, అడిషనల్కలెక్టర్ లత, ఏఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎలక్షన్ కమిషనర్‌ను కలిసిన కలెక్టర్, సీపీ
కరీంనగర్ టౌన్: కరీంనగర్ గెస్ట్ హౌజ్ లో సోమవారం స్టేట్‌ఎలక్షన్ కమిషనర్ పార్థసారథిని కలెక్టర్ బి.గోపి, సీపీ సుబ్బారాయుడు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు.