ఎగ్జిట్ పోల్స్ నిజం అయితే ఈవీఎంలు మంచివి.. లేకపోతే చెడ్డవా: ఎలక్షన్ కమిషన్

ఎగ్జిట్ పోల్స్ నిజం అయితే ఈవీఎంలు మంచివి.. లేకపోతే చెడ్డవా: ఎలక్షన్ కమిషన్

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లలో ఉపయోగించేవి రీఛార్జ్‎బుల్ బ్యాటరీలు కాదని.. వాటిని ఒకేసారి యూజ్ చేస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణకు ఆరు నెలల ముందే ఈవీఎం మిషన్లను పరిశీలించి వినియోగిస్తామని.. పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎంలను ఓపెన్ చేస్తామని స్పష్టం చేశారు. 2024, అక్టోబర్ 15న ప్రెస్ మీట్ నిర్వహించి జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‎ను రాజీవ్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈవీఎంల హ్యాకింగ్, ఎగ్జిట్ పోల్స్ అంచనాల గురించి ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. రాజీవ్ కుమార్ ఆన్సర్ ఇచ్చారు. 

ALSO READ | రెండు దశల్లో జార్ఖండ్ ఎన్నికలు: షెడ్యూల్ ఇదే

 

‘‘ఎగ్జిట్ పోల్స్‎కు ఎలాంటి శాస్త్రీయత లేదు. ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం అంచనాలు మాత్రమే. ఎగ్జిట్ పోల్స్ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయి. కౌంటింగ్ స్టార్ట్ అయిన పది నిమిషాలకే రిజల్ట్స్ వేయడం నాన్సెన్స్. ఉదయం 9.30 కంటే ముందే ఇచ్చే ఫలితాలు అంతా బోగస్. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ఆధారంగా ఎలక్షన్ కమిషన్‎పై నిందలు వేయడం అర్థరహితం. ఎగ్జిట్ పోల్స్‎లో ఎలక్షన్ కమిషన్ ప్రమేయం ఉండదు. ఎగ్జిట్ పోల్స్ ప్రకటనలో స్వీయ నియంత్రణ అవసరం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఫలితాలు రాకపోతే ఈవీఎంలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఆరు నెలల ముందే ఈవీఎంలను పరిశీలించి ఎన్నికల నిర్వహణలో ఉపయోగిస్తాం. 

ALSO READ | ఎగ్జిట్ పోల్స్ నిజం అయితే ఈవీఎంలు మంచివి.. లేకపోతే చెడ్డవా: ఎలక్షన్ కమిషన్

మూడంచెల భద్రత నడుమ ఈవీఎంలు ఉంటాయి.  నచ్చని ఫలితాలు వచ్చినప్పుడే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం’’ అని రాజీవ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. కాగా, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల జరిగిన హర్యానాలో  కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. దీంతో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈవీలంపై  పై విధంగా సీఈసీ వివరణ ఇచ్చారు.