న్యూఢిల్లీ, వెలుగు: ఈ వారం ఎలక్షన్ కమిటీ, వచ్చే నెల టికెట్ల ఖరారు ఉంటుందని కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అయితే సర్వేల ఆధారంగానే సీట్లు ఉంటాయని చెప్పారు. సోమవారం స్ట్రాటజీ మీటింగ్ తర్వాత ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఖర్గే, రాహుల్ నేతృత్వంలో జరిగిన భేటీలో అంతర్గత, బహిరంగ విషయాలు అన్ని మాట్లాడినట్లు చెప్పారు. కాంగ్రెస్ కు దూరమైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సముచిత స్థానం కల్పించాలని -రాహుల్ గాంధీ సూచించారన్నారు.
ALSO READ:పబ్లిక్ సొమ్ముతో మహారాష్ట్రలో సోకులా?.. సీఎం కేసీఆర్ పై షర్మిల ఫై
తెలంగాణ పర్యటనకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా-నని చెప్పారన్నారు. ఎన్నికలకు నాలుగు నెలలే గడువు ఉందని, అయితే ఈ ఎన్నికలకు కావాల్సిన యాక్షన్ ప్లాన్ సిద్ధమైనట్లు వెల్లడించారు. తన సోదరుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి తనకు తెలియదన్నారు. ఎటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తు ఉండదని చెప్పారు.