
ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ టీచర్ల పాత్ర ఎంతోకీలకం. గతంలో పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించడంపై అధికారులు అంతగా దృష్టి పెట్టలేదని టీచర్ల యూనియన్లు అభిప్రాయపడుతున్నాయి. ఎన్ని కల విధుల్లో ప్రభుత్వ టీచర్లు పెద్ద ఎత్తు న పాల్గొంటున్నా వారికి కల్పించే సదుపాయాలు మాత్రం తీసికట్టుగా ఉంటున్నాయి. శిక్షణ కేం ద్రాలతో మొదలు పెడితే పోలింగ్ రోజు పోలింగ్ ముగిసి ఈవీఎంలను స్ట్రాంగ్ రూం లకు తరలించే వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నట్లు టీచర్లు వాపోతున్నారు. ఏప్రిల్11న జరిగే పార్లమెంటు ఎన్నికల్లోనైనా మెరుగైన వసతుల కల్పించాలని పలు టీచర్లు యూనియన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. మిగతా అన్ని డిపార్టమెంట్ల కంటే టీచర్లే ఎక్కువ సంఖ్యలో పోలిం గ్ కేం ద్రాల్లో విధుల్లో నిర్వహిస్తారు. కానీ వారికి కల్పించే సౌకర్యాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది.
క్యాంపులో కష్టాలే….
వేల మంది ఉపాధ్యాయులు ఎన్నికల విధుల కోసం 2 రోజులు ఇంటి నుంచి దూరంగా ఉండి పోలింగ్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది . పోలింగ్ ముందురోజే ఎన్ని కల డ్యూటీకి రిపోర్ట్ చేసి అక్కడే ఉండాలి. వందలాది మందికి సరిపడా అక్కడ వసతులు కనిపించవు. ముఖ్యంగా మహిళా టీచర్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది . చిన్న పిల్లలున్న టీచర్లు, వయో భారంతో ఉన్న టీచర్లు ఇలా అందరూ తప్పనిసరిగా ఎన్ని కల విధుల్లో పాల్గొ నాల్సి ఉంటుంది . ఎన్నికల క్యాంపుటుగా ఫంక్షన్ హాల్స్, ఓపెన్ గ్రౌండ్స్ ని కేటాయిస్తారు. ఇందులో వందలాది మందికి సరిపడా బాత్రూంలు ఉండవు. చూడటానికి ఫ్యాన్లు ఉన్నా అవి తిరగవు. దోమల స్వైర విహారంతో టీచర్లు నిద్రకు దూరం అవుతున్నారు. టీచర్లకు అందిం చే రాత్రి భోజనం నాణ్యతగా ఉండదని, బయటివారికి క్యాటరింగ్ ఇవ్వడంతో నాసిరకంగా చేసి పెడతారని టీచర్లు పేర్కొంటున్నారు. గతంలో ఫుడ్ పడక వాంతులు,విరోచనాలైన ఉదంతాలు ఉన్నాయని టీచర్లు చెబుతున్నారు. కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు అందరూ ఒకే సమయంలో వెళ్లాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామన్నారు.
మంచినీరూ అంతంత మాత్రమే…
గతంలో వెంటి లేషన్ సరిగ్గా లేని మారుమూల గదుల్లో పోలింగ్ కేం ద్రాలను ఏర్పాటు చేశారు. వాటిల్లో మంచినీటి సదుపాయం అంతంత మాత్రంగానే ఉంటుంది . కమిటీ హాళ్లను పోలింగ్ కేంద్రాలుగా కేటాయిం చడంతో వాటిలో బాత్రూం సదుపాయాలు సరిగ్గా ఉండటం లేదు. మహిళా ఉపాధ్యాయులు ఎన్ని కల విధులంటే భయపడుతున్నారు. విద్యుత్ సదుపాయం లేని తరగతి గదులలో పోలింగ్ కేం ద్రాలు ఏర్పాటు చేసిన ఉదంతాలు గతంలో చాలానే ఉన్నాయి.లైట్ కోసం తాత్కలికంగా కరెంట్ లైన్ ఏర్పాటు చేసినా ఫ్యాన్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. వేసవి కావడంతో ఎన్నికల విధులు అంటేనే ఉపాధ్యాయులు హడలిపోతున్నారు. ఎన్ని కల విధుల్లో పాల్గొ నే అధికారులకు అందించే భోజనం నాణ్యత అంతంతమాత్రంగానే ఉంటుంది . పోలింగ్ ముందు రోజు రాత్రి భోజనం, పోలిం గ్ రోజు సిబ్బంది అందించే టిఫిన్, టీలు టైంకు అందిం చడం లేదు.యూనిఫాం రెమ్యూనరేషన్ కూడా ఒక్కోఏరియాకు ఒక్కోలా ఇస్తున్నారు. కొన్ని చోట్ల రూ.1800 ఇస్తుం టే మరికొన్ని చోట్ల రూ.2500 చెల్లిస్తున్నారు. ఎన్నాళ్లుగానో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు ఒకేలా రెమ్యునరేషన్ చెల్లిం చాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు.