బెల్లంపల్లి, వెలుగు : ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు ప్రచారంలో భాగంగా చేసే ప్రతి ఖర్చును లెక్కించాలని ఎన్నికల ఖర్చుల పరిశీలకులు అశోక్ కుమార్ సత్తార్ అధికారులను ఆదేశించారు. బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోటీ చేసే అభ్యర్థులు, ప్రచారాలకు సంబంధించిన ఖర్చుల వివరాల రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థికి రూ.40 లక్షల ఖర్చు పరిమితి నిర్ణయించామనిa
ప్రచారాల ఖర్చును నమోదు చేయాలని సూచించారు. అధికారుల లెక్కల్లో తప్పులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నేతలు ప్రజలను ప్రలోభపెట్టే చర్యలకు పాల్పడకూడదని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికల అంశాలు తెలిసి ఉండాలి
నస్పూర్ : ఎన్నికల నేపథ్యంలో అమలవుతున్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి, పోలింగ్ రోజు పాటించాల్సిన నిబంధనలను ఎన్నికల అధికారులు పూర్తిగా తెలుసుకొని ఉండాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. బుధవారం జిల్లాలోని కలెక్టరేట్భవన సమావేశ మందిరంలో సెక్టోరల్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమైందని
ALSO READ : అభివృద్ధి చేసిన నాకే మరో ఛాన్స్ ఇవ్వండి : పెద్ది సుదర్శన్‌రెడ్డి
శిక్షణలో ప్రతి అంశాన్ని పూర్తిగా నేర్చుకోవాలన్నారు. ఎన్నికల్లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు, సౌకర్యాలు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతిలాల్, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.