వర్ధన్నపేట, వెలుగు : వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పేరుతో ఉన్న ఎలక్షన్ గిఫ్ట్‌లను ఆదివారం స్పెషల్ స్క్వాడ్ ఆఫీసర్లు పట్టుకున్నారు. వర్ధన్నపేట మండలం దివిటిపల్లి గ్రామంలోని శివరాత్రి నిరంజన్ ఇంట్లో గిఫ్ట్‌లు ఉన్నట్లు సమాచారం రావడంతో ఆఫీసర్లు ఆదివారం తనిఖీ చేశారు.
ఓటర్లకు పంచేందుకు దాచి పెట్టిన 223 టిఫిన్ బాక్స్‌లు, 224 వాటర్ బాటిళ్లు, 168 బ్యాగ్‌లను స్వాధీనం చేసుకొని వర్ధన్నపేట పోలీసులకు అప్పగించారు. నిరంజన్‌పై పోలీసలు కేసు నమోదు చేశారు.