కామారెడ్డిలో కల్వకుంట్ల ఫ్యామిలీకి ప్రజలకు మధ్య వార్ : షబీర్​అలీ

  •     మాజీ మంత్రి షబ్బీర్ ​అలీ

కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డిలో ఈ సారి ఎన్నికల్లో కల్వకుంట్ల ఫ్యామిలీకి, ప్రజలకు మధ్య వార్​ జరగనుందని మాజీ మంత్రి షబీర్​అలీ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో కార్యకర్తలతో నిర్వహించిన ప్రోగ్రామ్ లో ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్, గజ్వేల్​లో రింగు రోడ్డు పేరుతో భూములమ్ముకొని, ఇప్పుడు కామారెడ్డి వస్తున్నారన్నారు. అందుకే ఇక్కడ రింగు రోడ్డు  ప్రస్తావన తీసుకొస్తున్నారన్నారు. మార్పు రావాలంటే కేసీఆర్​ను ఓడించాలన్నారు.

కామారెడ్డిలో కేసీఆర్​ను ఓడించి బీఆర్ఎస్​ను భూస్థాపితం చేస్తామన్నారు. గజ్వేల్​మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ.. గజ్వేల్​లో  కేసీఆర్​ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. 5 వేల ఇండ్లు కట్టిస్తానని చెప్పి, కేవలం 1200  ఇండ్లు మాత్రమే  కట్టారన్నారు. డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్ శ్రీనివాస్​రావు, లీడర్లు ఎడ్ల రాజిరెడ్డి, ఇంద్రాకరణ్​రెడ్డి పాల్గొన్నారు.