నిర్మల్​ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నిక

కుంటాల, వెలుగు : నిర్మల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం కుంటాల మండలంలోని కల్లూర్ లో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సట్లవార్ మహేశ్, ఉపాధ్యక్షుడిగా హరీశ్​రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కే. వెంకట్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సహ  కార్యదర్శిగా మహేశ్, నరేందర్, న్యాయ సలహాదారుడిగా తూర్పాటి వెంకటేశ్ ఎన్నికయ్యారు. సలహాదారులుగా సతీశ్​రావు, రాము, సురేశ్, సందీప్, ఆవినాష్ రెడ్డి, చిన్నయ్య ఎన్నిక కాగా నూతన కార్యవర్గాన్ని రైస్ మిల్లర్స్ ఘనంగా సన్మానించారు.