అచ్చంపేట, వెలుగు: ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఎలక్షన్ అబ్జర్వర్ బేరారామ్ ఆదేశించారు. ఆదివారం అచ్చంపేటలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నోడల్ ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రూ.10 లక్షల కంటే ఎక్కువగా జరిగే అనుమానాస్పద లావాదేవీలపై సమాచారం ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకు అలాంటి లావాదేవీలపై వివరణ కోరలేదని, ఇకపై ప్రతి లావాదేవీపై వ్యయ పరిశీలకులకు తెలియజేయాలన్నారు.
అక్రమ మద్యం, డ్రగ్స్ రవాణాపై ఎక్సైజ్ ఆఫీసర్లు దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇవ్వాల్సిన నివేదికలను ఎప్పటికప్పుడు పంపించాలని ఆదేశించారు. పోస్టర్లు, కరపత్రాలు, ప్లెక్సీలు, ముద్రించే ప్రింటింగ్ ప్రెస్‌లు ఎన్నికల రూల్స్ పాటించాలని కోరారు. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రకటనలపై దృష్టి పెట్టాలన్నారు. ఆర్డీవో గోపిరాం, ఆఫీసర్లు పాల్గొన్నారు.
ALSO READ : సోనియాగాంధీ రుణం తీర్చుకుందాం: కసిరెడ్డి నారాయణ రెడ్డి