మరికల్, వెలుగు: ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చే ఓటర్లు ఇబ్బందులు పడకుండా సౌలతులు కల్పించాలని ఎన్నికల పరిశీలకులు, డీఐజీ ధ్రువ్ పోలీసులకు సూచించారు. బుధవారం మండలంలోని మరికల్, చిత్తనూర్ గ్రామాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని కోరారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఐ రాజేందర్, ఎస్ఐ హరిప్రసాద్రెడ్డి పాల్గొన్నారు.
ఓటర్ల ఇంటికెళ్లి స్లిప్పులు ఇవ్వాలి
బాలానగర్: ఓటరు స్లిప్పులను ఇండ్లకు వెళ్లి అందజేయాలని తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. బుధవారం ఎంపీడీవో మీటింగ్ హాలులో సెక్టోరల్ ఆఫీసర్, సూపర్ వైజర్స్, బీఎల్వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు స్లిప్పులను ఓటర్లకు అందించే విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఎంపీడీవో కృష్ణారావు, ఏవో ప్రశాంత్ రెడ్డి, ఎంపీవో విజయకుమార్, ఇరిగేషన్ ఏఈ అనిల్ సాగర్, ఆర్ఐలు వెంకట్ రెడ్డి, రాజేశ్వరి, రాంమోహన్ రావు, సాయిలు పాల్గొన్నారు.