నకిరేకల్, వెలుగు : నకిరేకల్ మున్సిపాలిటీ నూతన చైర్మన్ ఎన్నిక అక్టోబర్ 3న నిర్వహించనున్నారు. ఇది వరకు మున్సిపల్ చైర్మన్ గా ఉన్న రాచకొండ శ్రీనివాస్ (బీఆర్ఎస్) పై ఆగస్టు 12l కౌన్సిలర్లు అవిశ్వాస పెట్టగా.. తీర్మానం నెగ్గిన విషయం తెలిసిందే. దీంతో దీంతో మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్న మురారి శెట్టి ఉమారాణి కృష్ణమూర్తి ఇన్చార్జిగా ఉన్నారు.
కాగా గురువారం ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీ నూతన చైర్మన్ ఎన్నికను నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశానికి మున్సిపాలిటీ పరిధిలోని 20 మంది వార్డు కౌన్సిలర్లు హాజరుకావాలని ఆర్డీఓ తెలిపారు.