ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక‌‌

కరకగూడెం, వెలుగు: పినపాక, కరకగూడెం మండలాల ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. కరకగూడెం మండలంలోని రాళ్లవాగు పెద్దమ్మతల్లి ఆలయం వద్ద ఈ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా సిరిశెట్టి కమలాకర్, ప్రధాన కార్యదర్శిగా వాగబోయిన సాంబశివరావు, కోశాధికారిగా గాందర్ల సతీశ్​ఎన్నికయ్యారు. ముఖ్య​అతిధిగా పాల్గొన్న అసోసియేషన్​రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల నర్సింహారావు మాట్లాడుతూ..

రాష్ట్ర ప్రభుత్వం పేద ఫొటోగ్రాఫర్లను ఆదుకోవాలని కోరారు. ఫొటోగ్రాఫర్లందరూ కుటుంబ భరోసా పథకంలో చేరాలని సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు మారుతిప్రకాశ్, కన్వీనర్ పంపన రమేశ్, కోశాధికారి బల్లెం అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ALS0 READ: జగిత్యాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన సెంట్రల్ BSF బలగాలు