24 న సిర్పూర్ టీ ఎంపీపీ ఎన్నిక

కాగ జ్ నగర్,వెలుగు : ఇటీవల అవిశ్వాసం నెగ్గడం తో ఖాళీ అయిన  సిర్పూర్ టి మండల ప్రజా పరిషత్తు అధ్యక్ష స్థానం భర్తీకి ఎన్నికల కమిషన్   నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ మేరకు అక్కడి ఎంపిడిఓ సత్యనారాయణ  ఈ విషయాన్నిపేర్కొన్నారు. ఇటీవల అవిశ్వాస తీర్మానం నెగ్గడం తో ఎంపీపీ గా ఉన్న చునార్కార్ సువర్ణ దిగిపోయారు.ఆ తర్వాత వైస్ ఎంపీపీగా కొనసాగుతున్న ఏర్త సత్యనారాయణ కు ఇంఛార్జి భాద్యతలు ఇస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

వచ్చే జూన్ 3 వరకు ఎంపీపీ ల గడువు కాలం  ఉండగా ఈ క్రమంలో రెగ్యులర్ ఎంపీపీ ఎన్నిక కోసం నోటిఫికేషన్ రావడం గమనార్హం. ఇక్కడ 8 మంది ఎంపీటీసీ లు ఉన్నారు. ఇప్పటికే నోటీసులు కూడా ఎంపీటీసీ లకు చేరినట్లు. తెలుస్తోంది. ఎన్నిక అధికారిగా కాగ జ్ నగర్ ఆర్డీవో సురేష్ బాబు వ్యవహరించనున్నారు.