యాదాద్రి, వెలుగు: ఎమర్జెన్సీ సేవల్లో కొనసాగుతున్న స్టాఫ్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోవాలని ఎన్నికల ఆఫీసర్, కలెక్టర్ హనుమంతు జెండగే సూచించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన ఆఫీసర్ల మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఫారం12 -డీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సౌకర్యాన్ని ఎన్నికల కమిషన్ కల్పించిందన్నారు. పార్ట్--1లో ఉద్యోగుల సమాచారం, వారి సంతకం, పార్ట్--2 లో నోడల్ అధికారి ధ్రువీకరించాల్సి ఉంటుందని చెప్పారు. శుక్రవారం నుంచి 8వ తేదీలోపు సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు పంపాలని తెలిపారు. ఆర్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెలిసిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవచ్చని తెలిపారు. మీటింగ్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శేఖర్ రెడ్డి, ఆఫీసర్లు జయకృష్ణ, అశోక్, హుస్సేన్, సత్య ప్రకాశ్, వినోద్, వెంకటేశ్వరరావు ఉన్నారు.
ALSO READ : బీజేపీ మూడోలిస్టులో ఆరుగురు కన్ఫాం