బీఆర్ఎస్ నేత ఇంట్లో ఎన్నికల అధికారుల తనిఖీలు

జగిత్యాల: మరో కొన్ని గంటల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు అందడమే ఆలస్యం ఎన్నికల అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నగదు పట్టుబడగా.. మరికొన్ని రాజకీయ నేతల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం.

ఈ క్రమంలో జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో బీఆర్ ఎస్ నేతల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు ఎన్నికల అధికారులు. ఓటర్లుకు పంచేందుకు పెద్ద ఎత్తున నగదు నిల్వ ఉంచారని ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో వెల్గటూర్ బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు చల్లూరి రామచందర్ గౌడ్ ఇంట్లో ఎన్నికల అధికారులు సోదాలు నిర్వహించారు. 

బీఆర్ ఎస్ నేత రామచందర్ గౌడ్ ఇంట్లో ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా పెద్ద ఎత్తున కాంగ్రెస్, బీఆర్ ఎస్ కార్యకర్తలు అక్కడి చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.. నిబంధనలు ఉల్లంఘిస్తే 144 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తామని హెచర్చించారు. 

Also Read:-ఏపీ ఉద్యోగులకు శుభవార్త.. తెలంగాణలో ఓటేసేందుకు నవంబర్​ 30న సెలవు