మందమర్రి ఎన్నికల కోసం పోరాడుదాం : ఎన్నికల సాధన కమిటీ 

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి మున్సిపల్​ ఎన్నికల కోసం కలిసికట్టుగా పోరాడుదామని ఎన్నికల సాధన కమిటీ నిర్ణయించింది. శనివారం మందమర్రి ప్రెస్​క్లబ్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, జనసేన, బీఎస్పీ, వివిధ పార్టీల లీడర్లతో కూడిన ఎన్నికల సాధన కమిటీ బాధ్యులు మాట్లాడారు. ఎన్నికల విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని, అందుకు ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఏజెన్సీ ప్రాంతమైన ఊరు మందమర్రిని 1950 యాక్ట్​ప్రకారం గ్రామపంచాయతీగా చేసి ఆ ప్రాంతం బౌండరీలు గుర్తించి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మిగిలిన అర్బన్ ప్రాంతంలో మున్సిపల్​ఎన్నికలు జరిగేలా కృషి చేస్తే మందమర్రి టౌన్​ అభివృద్ధికి నోచుకుంటుందని చెప్పారు. మున్సిపల్​ఎన్నికల సాధన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ కన్వీనర్​గా అందుగుల శ్రీనివాస్, కో కన్వీనర్లుగా సప్పిడి నరేశ్, మేడిపల్లి సంపత్, బండారు సూరిబాబు, కొంగల తిరుపతిరెడ్డి, ఎండీ అబ్బాస్, రంగు శ్రీనివాస్, మాయ రమేశ్, ముల్కల రాజేంద్రప్రసాద్, ఆశాది సురేశ్, వెంకన్న, ఎంఏ రసూల్​తదితరులను ఎన్నుకునన్నారు.