- అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్, వెలుగు: ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని వాగ్ధానాలను అమలు చేస్తున్నామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. శుక్రవారం తాండూరులో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
అంతకు ముందు స్థానిక మెటర్నిటీ & చైల్డ్ హాస్పిటల్ లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ఆయన ప్రారంభించారు. చీఫ్విప్పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ స్వప్న , సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ పాల్గొన్నారు.