ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాల్లో కాంగ్రెస్‌ అనూహ్యంగా పుంజుకుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.  ఖమ్మం జిల్లాలో  కాంగ్రెస్​ అభ్యర్థులను ఎవరిని అసెంబ్లీ గేటును తాకనివ్వనని పొంగులేటి శపథం చేశారు.  అయితే ఒక్క భద్రాచలం తప్ప అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ ఘన విజయం సాధించింది.  . మెజారిటీ నియోజకవర్గాల్లో హస్తం పార్టీ సత్తా చాటింది.   ఉమ్మడి ఖమ్మం జిల్లాలొ ఏయే నియోజకవర్గాల్లో, ఎవరు గెలిచారో  తెలుసుకుందాం

ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 8  స్థానాల్లో కాంగ్రెస్... ఒక స్థానం  సీపీఐ, ఒక స్థానం బీఆర్ఎస్​ అభ్యర్థులు గెలుపొందారు. 

  • అశ్వరావుపేట  : కాంగ్రెస్​ అభ్యర్థి ఆదినారాయణ 28,845   ఓట్ల తేడాతో గెలుపొందారు 
     
  • సత్తుపల్లి : కాంగ్రెస్​ అభ్యర్థి డాక్టర్.మట్ట రాగమయి 12, 734 ఓ ట్ల తేడాతో గెలుపొందారు. 
     
  • ఖమ్మం:  కాంగ్రెస్​ అభ్యర్థి  తుమ్మల నాగేశ్వరరావు  విజయం సాధించారు.  
     
  • మధిర  : కాంగ్రెస్​ అభ్యర్థి  భట్టి విక్రమార్క విజయం సాధించారు. 
     
  • ఇల్లందు: కాంగ్రెస్​ అభ్యర్థి కొరం కనకయ్య ..బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియ నాయక్ పై 18 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
     
  • కొత్తగూడెం : కాంగ్రెస్​ కూటమి అభ్యర్థి  కూనంనేని సాంబశివరావు ( సీపీఐ) విజయం
     
  • పాలేరు: కాంగ్రెస్​ అభ్యర్థి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి  విజయం
     
  • భద్రాచలం: బీఆర్​ఎస్​ అభ్యర్థి  డాక్టర్ తెల్లం వెంకట్రావు  గెలుపొందారు. 
     
  • వైరా:  కాంగ్రెస్​ అభ్యర్థి మాలోతు రామదాస్​ విజయం సాధించారు
     
  • పినపాక: కాంగ్రెస్​ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు   విజయం సాధించారు.