అలంపూర్, వెలుగు: హైవేపై సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రకళ సూచించారు. శుక్రవారం అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డులో పోలీస్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగదు తరలించకుండా పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలన్నారు.
పట్టుబడిన మద్యం, డబ్బులు, వస్తువుల వివరాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలన్నారు. ఫ్లయింగ్ స్కాడ్, ఎస్ఎస్ఏ టీమ్ 24 గంటల పాటు పని చేయాలన్నారు. వివిధ పార్టీల నాయకులు నిర్వహించే ర్యాలీలు, సభలు, సమావేశాలకు పర్మిషన్లు పరిశీలించాలని సూచించారు. సీఐలు డి రాజు, శివశంకర్ పాల్గొన్నారు.