![ఓటుకు కమ్మలు : బంగారం పేరుతో గిల్ట్ నగలిచ్చారు](https://static.v6velugu.com/uploads/2019/04/Kammalu.jpg)
చిత్తూరు : పలమనేరు నియోజకవర్గంలో గిల్ట్ కమ్మల పంపిణీ హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల వేళ డబ్బులు, నగలు, మద్యం పంపిణీ చేసి ప్రలోభ పెట్టి ఓటర్లను ఆకట్టుకోవడం సాధారణంగా జరుగుతున్నదే. ఐతే… ఓ పార్టీ నేతలు…ఇచ్చిన కానుకలపై నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.
ఓటుకు కమ్మలంటూ ఓ అభ్యర్థి తన అనుచరులతో ఓటర్లకు కానుకలు పంపిణీ చేయించారు. బంగారు కమ్మలు అంటూ పెద్ద ఎత్తున పంపిణీ చేశారు ఆ పార్టీ నేతలు. కానుకలు తీసుకున్న ఓటర్లు తెలివిగా బంగారు దుకాణంలో వాటిని చెక్ చేయించారు. అవి బంగారం కమ్మలు కాదు… గిల్ట్ నగలని తేలింది. అసలు విషయం తెలుసుకున్న ఓటర్లు.. నాయకుల తీరుపై విసుక్కున్నారు. మోసం చేయడం కరెక్ట్ కాదన్నారు.
![](http://www.v6velugu.com/wp-content/uploads/2019/04/Kammalu.jpg)